ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ గణపతి మందిర్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు శాలువా కప్పి సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి మందిర్ కమిటీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, కమిటీ సభ్యులతో పాటు న్యాయవాది నటేశ్వర్ ప్రభాకర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});