గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ బిబిపేట మండలంలోని వివిధ వినాయక మండపాల వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడిని తొలి పూజ్యుడిగా భావించే హిందూ సంప్రదాయం ప్రకారం ముందుగా గణనాథుడికి పూజలు నిర్వహించిన అనంతరం ఇతర దేవతలకు పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందని మండపాల నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొనాలని, పాడిపంటలు బాగా పండాలని వినాయకుడిని...