ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కోల్ బెల్ట్ న్యూస్(కరీంనగర్): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరినప్పుడు వారిని బెదిరించడం, భయపెట్టడం సరైన పద్ధతి కాదని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. బకాయిపడిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 51 శాతం ఫిట్‌మెంట్‌తో...