కోల్‌ఇండియా స్థాయిలో సింగరేణి క్రీడా పతాకాన్ని ఎగరవేయాలి

ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి క్రీడాకారులు కోల్‌ఇండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ ఆకాంక్షించారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని ఎల్లందు క్లబ్‌లో సింగరేణి స్థాయి 62వ వార్షిక క్రీడోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న లాన్ టెన్నిస్ పోటీలను కేకే ఏజెంట్ ఖదీర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాగం మల్లేష్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు...