అంబేద్కర్‌పై వ్యాఖ్యలపై నిరసన
కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అమర ప్రసాద్ అనే వ్యక్తి తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలపై బీబీపేట మండలంలోని అంబేద్కర్ యువజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడిగా, ప్రపంచ మేధావిగా, అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన నాయకుడిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని వారు...