కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అమర ప్రసాద్ అనే వ్యక్తి తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలపై బీబీపేట మండలంలోని అంబేద్కర్ యువజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడిగా, ప్రపంచ మేధావిగా, అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన నాయకుడిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిపై అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలో అమర ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాదాపు 50 మంది వ్యక్తిగతంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీబీపేట మండలంలోని 11 గ్రామాలకు చెందిన దళిత నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});