CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 1:02 pm Posted By: coalbelt 24 News

ముదిరాజ్ ఫ్రీడమ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):

కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలోని పైమరి స్కూల్ వద్ద ముదిరాజ్ ఫ్రీడమ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వినాయకుడిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ముదిరాజ్ ఫ్రీడమ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ.. అన్నదానం కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నమస్కరిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});