విలీన పోరాట స్ఫూర్తితో అరాచక శక్తులను గద్దె దించుతాం
సెప్టెంబర్ 17 చరిత్రపై కాంగ్రెస్, బీజేపీల తప్పుడు ప్రచారం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో ప్రస్తుత అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, త్యాగాల చరిత్రకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో...