సింగరేణి పాఠశాలలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి సింగరేణి పాఠశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాముఖ్యత, తెలంగాణ చారిత్రక నేపథ్యాన్ని విద్యార్థులకు వివరించారు. తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందిన చారిత్రక పరిణామాలు, ప్రజలు సాగించిన పోరాటం, వారి త్యాగాలు, స్వాతంత్ర్య ప్రాధాన్యత తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. తెలంగాణ చరిత్రను ప్రతి ఒక్కరూ...