సింగరేణిలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి సురక్షిత బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలి: మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యోగులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం...