మందమర్రిలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మందమర్రి మున్సిపాలిటీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. 1948లో నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజుగా ఈ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. విమోచనతో తెలంగాణ ప్రజలకు...