క్రీడలతో ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా రాత్రింబవళ్లు శ్రమించే ఉద్యోగుల శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఏరియా సర్వే ఆఫీసర్ దేశాయ్ అన్నారు. మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో గురువారం నిర్వహించిన 62వ వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో భాగంగా వాలీబాల్ పోటీలను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాలీబాల్ కేవలం ఆట మాత్రమే కాదని,...