CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 6:46 pm Posted By: coalbelt 24 News

క్రీడలతో ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా రాత్రింబవళ్లు శ్రమించే ఉద్యోగుల శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఏరియా సర్వే ఆఫీసర్ దేశాయ్ అన్నారు. మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో గురువారం నిర్వహించిన 62వ వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో భాగంగా వాలీబాల్ పోటీలను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాలీబాల్ కేవలం ఆట మాత్రమే కాదని, పరస్పర నమ్మకం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. మైదానంలో ప్రదర్శించే ఐక్యత, సమన్వయం పని ప్రదేశంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు దోహదపడుతుందని అన్నారు. గెలుపోటముల కంటే పోటీల్లో పాల్గొనడం, క్రీడా స్ఫూర్తిని చాటడం ముఖ్యమని తెలిపారు. ఉద్యోగులు తమ బిజీ జీవనశైలిలో క్రీడలను భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సురేందర్, సీనియర్ పీఓ కార్తీక్, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు సీవీ రమణ, క్లబ్ సెక్రటరీ పెద్దపల్లి బానయ్య, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శ్రీను, పలువురు క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});