రూ.445 తగ్గిన 24 క్యారెట్ల బంగారం
వెండి ధరలో రూ.2,682 తగ్గుదల
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,56,565గా ఉండగా.. గురువారం నాటికి రూ.445 తగ్గి రూ.1,56,120కు చేరింది.
ఆభరణాల తయారీలో సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,40,660గా నమోదైంది.
బంగారంతో పోలిస్తే వెండి ధరలో మరింత తగ్గుదల కనిపించింది. మంగళవారం కిలో వెండి ధర రూ.2,37,990గా ఉండగా.. బుధవారం నాటికి రూ.2,682 తగ్గి రూ.2,35,308కు చేరింది. మార్కెట్‌లో ధరలు రోజువారీగా మారే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు తాజా ధరలను పరిశీలించాలని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});