జీవో 76 పట్టాలు వెంటనే పంపిణీ చేయాలి

ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ ఎంసీపీఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): సింగరేణి భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు భూమి హక్కులు కల్పించేందుకు జారీ చేసిన జీవో 76 అమలులో నెలకొన్న జాప్యాన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంసీపీఐ(యు) డిమాండ్ చేసింది. గురువారం బెల్లంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో జీవో 76 కింద...