CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 10:55 am Posted By: coalbelt 24 News

జీవో 76 పట్టాలు వెంటనే పంపిణీ చేయాలి

ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్
ఎంసీపీఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సింగరేణి భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు భూమి హక్కులు కల్పించేందుకు జారీ చేసిన జీవో 76 అమలులో నెలకొన్న జాప్యాన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంసీపీఐ(యు) డిమాండ్ చేసింది. గురువారం బెల్లంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడారు.

గత ప్రభుత్వం హయాంలో జీవో 76 కింద పలువురు లబ్ధిదారుల నుంచి చలానాలు స్వీకరించి, కొందరికి పట్టాలు పంపిణీ చేసినప్పటికీ వేలాది మందికి ఇప్పటికీ పట్టాలు అందలేదని వారు పేర్కొన్నారు. పేదలు అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి చలానాలు చెల్లించినా దాదాపు మూడేళ్లు గడుస్తున్నా పట్టా సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

పట్టాలు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం, మరమ్మతులకు రుణాలు పొందడం, ఆస్తి బదలాయింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో లబ్ధిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న పట్టాలను పంపిణీ చేయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జీవో 76 బాధితులను ఏకం చేసి ఆందోళనలు చేపడతామని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దిగ్బంధానికి కూడా వెనుకాడబోమని నాయకులు హెచ్చరించారు. సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్‌తో పాటు తొగరి రాహుల్, సంభోజి రాజేష్, అరుణ్, వంశీ, రామకృష్ణ, శేఖర్, అజయ్, రాధ, లక్ష్మీ, పద్మ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});