CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 10:06 pm Posted By: coalbelt 24 News

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన సదస్సు

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, పరిష్కార మార్గాలపై చర్చించేందుకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సెప్టెంబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు రేనే హాస్పిటల్ వెనుక ఉన్న హోటల్ మహాతి కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను సదస్సులో చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులు కోరారు. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పనిసరిగా హాజరై తమ సంఘాలకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగుల సమస్యలను సదస్సు దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులు ఆహ్వానం పలికారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});