కొడంగల్‌లో 20న పాంచజన్య సంకల్ప సభ
పెద్దపల్లి జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలి టిఆర్ఎస్ పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు పెద్దపల్లి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో...