పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై అనుమానాలు

పోటీకి అవకాశం లేకుండా నిబంధనలు మార్చారన్న తెలంగాణ రక్షణ సేన ఆరోపణ కోల్ బెల్ట్ న్యూస్(కరీంనగర్): నగర పాలక సంస్థలో టెండర్ల ప్రక్రియకు సంబంధించి డి.బి. సెక్షన్ విధిస్తున్న ప్రత్యేక నిబంధనలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. నగర పాలక సంస్థలో పిలిచిన వాటర్ పైప్‌లైన్ టెండర్‌లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు కాకుండా పైపుల తయారీ సంస్థలకు మాత్రమే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. గతంలో రూ.45 లక్షల విలువైన...