గొంతులో ఇరుక్కున్న ఇనుప మేకును తొలగించిన వైద్యులు

భోజనం చేస్తూ ఇనుప మేకు మింగిన మహిళ ఎండోస్కోపీతో విజయవంతంగా తొలగింపు మహిళకు ప్రాణాపాయం తప్పించిన వైద్యులు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): భోజనం చేస్తుండగా అనుకోకుండా ఇనుప మేకును మింగిన 56 ఏళ్ల మహిళకు కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన మహిళ మంగళవారం రాత్రి భోజనం చేస్తుండగా అనుకోకుండా ఇనుప మేకును మింగారు. దీంతో ఆ మేకు గొంతులో ఇరుక్కుపోవడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు....