డీజేలకు నో.. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
డీజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లకు అవగాహన, హెచ్చరిక మందమర్రి ఎస్ ఐ నరేష్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు డీజేలకు పూర్తిగా దూరంగా ఉండాలని మందమర్రి ఎస్సై నరేష్ సూచించారు. శబ్ద కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా స్థానిక డీజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లకు అవగాహన కల్పించడంతో పాటు బైండ్ ఓవర్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. మంగళవారం మందమర్రి పోలీస్ స్టేషన్‌లో డీజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లతో ఎస్సై నరేష్ అవగాహన నిర్వహించారు....