ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

18లోగా హామీలు అమలు చేయకుంటే హైదరాబాద్ దిగ్భంధం టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఈ నెల 18లోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో హైదరాబాద్ దిగ్భంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...