మందమర్రిలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలను మందమర్రి ఎల్లందు క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణతో పాటు అధికారులు, ఇంజనీర్లు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ దేశ నిర్మాణంతో పాటు నీటిపారుదల, ఇంజనీరింగ్ రంగాల అభివృద్ధికి విశ్వేశ్వరయ్య అందించిన సేవలు అపారమైనవని కొనియాడారు. ఆయన పాటించిన...