మందమర్రి కే.కే-5 గనిలో ప్రమాదం
పైకప్పు కూలి కార్మికుడికి గాయాలు ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, కార్మికులు రక్షణ చర్యలు పాటించడం లేదంటున్న గుర్తింపు సంఘం కార్మికుడిని పరామర్శించిన సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియాలోని కే.కే-5 గనిలో మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి షిఫ్ట్‌లో సుమారు 1.30 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలడంతో ఎస్‌డీఎల్ ఆపరేటర్ కస్తూరి శంకర్ గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కార్మికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిషేధిత ప్రాంతంగా ఉన్న 3వ సీమ్, 14వ...