అసెంబ్లీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కావాలి
రాజకీయ బలాబలాల ప్రదర్శనకు కాకుండా ప్రజా సమస్యలపై చర్చించాలి టీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్ (పెద్దపల్లి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలు చూపించే వేదికగా ఉండాలే తప్ప అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ బలాబలాలను నిరూపించుకునే వేదికగా మారకూడదని టీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల తీరును పరిశీలిస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలకే అధిక ప్రాధాన్యత...