ప్రజల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

1000 రోజుల పాలన అంతా మోసాల మయం టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్‌ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్‌ ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద...