బీబీపేట మార్కెట్‌ను హోల్‌సేల్ మార్కెట్‌గా ప్రకటించాలి
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంతకు వేల సంఖ్యలో రైతులు, వ్యాపారులు తరలివస్తుంటారు. రైతులు పండించిన పంటలను విక్రయించడంతో పాటు వివిధ రకాల వస్తువుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో మార్కెట్‌కు విశాలమైన స్థలం అవసరమని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ, కొరివి నర్సింలు పేర్కొన్నారు. బీబీపేట మార్కెట్‌లో ప్రతివారం నిర్వహించే వేలంపాట, రోజువారీ సంత ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతున్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్ స్థలంలో భవన నిర్మాణం చేపట్టడం వల్ల రైతులు,...