కార్మిక సమస్యల పరిష్కారాన్ని ఓర్వలేకే తప్పుడు ప్రచారం

టీబీజీకేఎస్‌పై ఏఐటీయూసీ నాయకుల ఆరోపణలు. కేకే-5 గనిలో గేట్‌ మీటింగ్ కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): మందమర్రి ఏరియాలోని కేకే-5 గని ఆవరణలో మంగళవారం కార్మిక గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు కార్మికుల అపరిష్కృత సమస్యలు, యాజమాన్యంతో పాటు లేబర్‌ కమిషనర్‌తో ఇటీవల జరిగిన చర్చల వివరాలను కార్మికులకు వివరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ సలింద్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ...