మందమర్రి మార్కెట్‌లో నాళాలను కబ్జా చేసి నిర్మించిన షెడ్లను తొలగించాలి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మార్కెట్‌లో వ్యాపార సముదాయాల ముందు ఉన్న నాళాలను కబ్జా చేసి షెడ్లు నిర్మించడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. అంతేకాకుండా విద్యుత్ తీగల సమీపంలో నిర్మాణాలు చేపట్టడంతో ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మందమర్రి నోడల్ అధికారి ఎన్. రాజేశ్వర్‌కు బీఎస్పీ నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ...