కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభకు భారీ స్పందన లభించింది. సభ జనసంద్రంగా మారగా, పెద్దపల్లి నుంచి తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, అభిమానులు సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. దీంతో సభా ప్రాంగణం కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది.
సభలో తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత ఉద్వేగభరితంగా ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, హక్కులతో పాటు సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, వైద్యం తదితర అంశాలపై ఆమె సుదీర్ఘంగా ప్రసంగించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తన రాజకీయ ప్రయాణంలో కష్టకాలంలో అండగా నిలిచిన నిజామాబాద్ ప్రజలకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనకు అందించిన మద్దతు, ఆదరణను ఎప్పటికీ మరువబోనని ఆమె పేర్కొన్నారు.
కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పాంచజన్య సంకల్ప సభ సందడిగా సాగింది. సభా ప్రాంగణం కార్యకర్తల నినాదాలతో మార్మోగిం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});