చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారమే పునాది

జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించాలి కోల్ బెల్ట్ న్యూస(మంచిర్యాల): చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు రోగనిరోధక శక్తి, ఏకాగ్రతకు సమతుల్య పోషకాహారం ఎంతో కీలకమని నేచురోపతి, యోగా వైద్యురాలు, వెల్‌నెస్‌ నిపుణురాలు, లైఫ్‌స్టైల్‌ కోచ్‌ డాక్టర్‌ పి. సమీరా రెడ్డి అన్నారు. మంచిర్యాల జన్మభూమి నగర్‌లోని ఎథిక్‌ అకాడమీ స్కూల్‌ ఆధ్వర్యంలో ‘న్యూట్రినెక్స్ట్‌ – నేడు పోషణ.. రేపు ఆరోగ్యకరమైన భవిష్యత్తు’ పేరుతో సోమవారం హోటల్‌ సుచిత్ర ఇన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...