సమగ్ర భూ సర్వేకు సహకరించాలి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో సోమవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలకు సమగ్ర భూ సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదు విధానం, సర్వే నిర్వహణ ఉద్దేశాలు, తద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. సమగ్ర భూ సర్వే ద్వారా గ్రామంలోని భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్యానికి సంబంధించిన వివరాలను పకడ్బందీగా నమోదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. భూ రికార్డుల్లో వివరాల నమోదు, భూముల హద్దుల నిర్ధారణ...