ఒంటరి మహిళల దరఖాస్తుల పరిశీలన

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మండలంలోని ఒంటరి మహిళల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని మండల అధికారి రాజేశ్వర్ సోమవారం చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో ఆయన మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో స్వయంగా పర్యటించి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ మండలవ్యాప్తంగా మొత్తం 35 ఒంటరి మహిళల దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. మామిడిగట్టు గ్రామపంచాయతీలో 2, వెంకటాపూర్‌లో 13, అదిల్‌పేట్‌లో 3, పొన్నారంలో 7, సారంగపల్లిలో 2, చిర్రకుంటలో 4, శంకర్‌పల్లిలో 2, అందుగులపేటలో 2 దరఖాస్తులను...