CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 7:12 pm Posted By: coalbelt 24 News

ఒంటరి మహిళల దరఖాస్తుల పరిశీలన

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి మండలంలోని ఒంటరి మహిళల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని మండల అధికారి రాజేశ్వర్ సోమవారం చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో ఆయన మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో స్వయంగా పర్యటించి దరఖాస్తులను పరిశీలించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా మండల అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ మండలవ్యాప్తంగా మొత్తం 35 ఒంటరి మహిళల దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. మామిడిగట్టు గ్రామపంచాయతీలో 2, వెంకటాపూర్‌లో 13, అదిల్‌పేట్‌లో 3, పొన్నారంలో 7, సారంగపల్లిలో 2, చిర్రకుంటలో 4, శంకర్‌పల్లిలో 2, అందుగులపేటలో 2 దరఖాస్తులను పరిశీలించినట్లు వివరించారు. దరఖాస్తుల్లోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతలను నిర్ధారించే ప్రక్రియను చేపట్టినట్లు ఆయన తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});