చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ గారి కుమార్తె కల్వ ప్రజ్ఞా రెడ్డి దశదిన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజ్ఞా రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రజ్ఞా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన రజనీష్ జైన్, ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉంటామని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ప్రజ్ఞా రెడ్డికి నివాళులు అర్పించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});