డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల మండల తహశీల్దార్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్కీ డ్రాలో వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపులు చేపట్టారని తెలిపారు. అయితే బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించకుండా జనరల్ కేటగిరీలో లక్కీ డ్రా...