మైనార్టీల సంక్షేమానికి బీజేపీ కట్టుబాటు

మహబూబ్‌నగర్‌లో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ బలోపేతం, మైనార్టీల సమస్యలపై విస్తృత చర్చ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ మోర్చా కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, మైనార్టీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర...