CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 9:39 pm Posted By: coalbelt 24 News

మైనార్టీల సంక్షేమానికి బీజేపీ కట్టుబాటు

మహబూబ్‌నగర్‌లో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
పార్టీ బలోపేతం, మైనార్టీల సమస్యలపై విస్తృత చర్చ

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ మోర్చా కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, మైనార్టీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రభారి జయశ్రీ, బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. మైనార్టీ వర్గాల్లో పార్టీకి మరింత ఆదరణ పెంచే విధంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరంపై నాయకులు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.

అలాగే మైనార్టీ మోర్చా కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ కావాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులు సూచించినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మైనార్టీ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి మైనార్టీ మోర్చా నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});