54వ డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 54వ డివిజన్ పరిధిలోని స్టేషన్ రోడ్ నుంచి గాంధీనగర్ వరకు నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు గట్టు మహేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు మారుతున్నారే తప్ప కాలనీల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగుపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలమయమైన రోడ్ల కారణంగా వాహనదారులు, కాలినడకన వెళ్లే విద్యార్థులు,...