క్రీడలతో శారీరక దృఢత్వం.. మానసిక ఉల్లాసం

జాతీయ క్రీడా దినోత్సవంలో అదనపు కలెక్టర్ విక్టర్ కోల్ బెల్ట్ న్యూస్(కామారెడ్డి):  మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం దోమకొండ కోటలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దోమకొండ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) విక్టర్, (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. మేజర్ ధ్యాన్‌చంద్ దేశానికి అందించిన క్రీడా సేవలు, ఆయన సాధించిన...