విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ బుక్స్ పంపిణీ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మందమర్రి కళ్యాణిఖని పాఠశాల విద్యార్థులకు శనివారం బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఇన్‌చార్జి రజిత సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షలు ఎంతో కీలకమని అన్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయంగా బుక్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు...