CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 9:28 pm Posted By: coalbelt 24 News

విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ బుక్స్ పంపిణీ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మందమర్రి కళ్యాణిఖని పాఠశాల విద్యార్థులకు శనివారం బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఇన్‌చార్జి రజిత సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షలు ఎంతో కీలకమని అన్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయంగా బుక్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహకరించేందుకు ముందుకు వచ్చే దాతలు, సేవాభిమానులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించాలని కోరారు. దాతలు అందించే సహకారాన్ని అవసరమైన వారికి చేరేలా సద్వినియోగం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నందిపాటి రాజ్‌కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, ఎండీ జావిద్ పాషా, అన్వేష్, సూర్య, ఇమామ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});