క్రీడలతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): మేరా యువ భారత్‌ (మై భారత్‌) పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌, జిల్లా స్పోర్ట్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ సుధారాణి, జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ భారత హాకీ దిగ్గజం, క్రీడా రంగంలో చిరస్మరణీయ క్రీడాకారుడైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా...