సేవామూర్తులకు రాఖీలు కట్టి కృతజ్ఞతలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఎథిక్ అకాడమీ పాఠశాల ప్రాంగణంలో రక్షాబంధన్ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. సమాజ రక్షణ, ఆరోగ్యం, ఆహార భద్రత, న్యాయం కోసం సేవలందిస్తున్న పోలీస్ ఎస్‌ఐ మధుసూదన్, ప్రభుత్వ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ విక్రమ్, రైతు రాకేష్, సీనియర్ న్యాయవాది మల్లారెడ్డిలను విద్యార్థులు ఘనంగా సత్కరించి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మధుసూదన్ విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. డాక్టర్ విక్రమ్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిపారు. రైతు రాకేష్ వ్యవసాయం ప్రాధాన్యతను,...