కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఎథిక్ అకాడమీ పాఠశాల ప్రాంగణంలో రక్షాబంధన్ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. సమాజ రక్షణ, ఆరోగ్యం, ఆహార భద్రత, న్యాయం కోసం సేవలందిస్తున్న పోలీస్ ఎస్‌ఐ మధుసూదన్, ప్రభుత్వ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ విక్రమ్, రైతు రాకేష్, సీనియర్ న్యాయవాది మల్లారెడ్డిలను విద్యార్థులు ఘనంగా సత్కరించి రాఖీలు కట్టారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా ఎస్‌ఐ మధుసూదన్ విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. డాక్టర్ విక్రమ్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిపారు. రైతు రాకేష్ వ్యవసాయం ప్రాధాన్యతను, రైతుల కష్టాన్ని వివరించారు. న్యాయవాది మల్లారెడ్డి మంచి ప్రవర్తనతో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
పాఠశాల డైరెక్టర్ చరణ్‌రెడ్డి మాట్లాడుతూ రక్షాబంధన్‌ను అన్నాచెల్లెళ్ల బంధానికే పరిమితం కాకుండా సమాజ సేవకుల పట్ల గౌరవం, కృతజ్ఞత చాటేలా నిర్వహించామని తెలిపారు. పోలీసులు భద్రత, వైద్యులు ఆరోగ్యం, రైతులు ఆహారం, న్యాయవాదులు న్యాయం కోసం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});