డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు

అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలి మందమర్రి టీఆర్‌ఎస్‌ నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం మందమర్రి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు సూరిబాబు, బత్తుల శ్రీనివాస్‌, తదితరులు మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం కేటాయించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అర్హత లేని వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించారని వారు విమర్శించారు. లక్కీ డ్రాకు...