CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 8:39 pm Posted By: coalbelt 24 News

సుదీర్ఘ సేవలకు ఘన వీడ్కోలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించిన జీఎం (ఈ అండ్ ఎం, సీహెచ్‌పీ-కార్పొరేట్) సోమయాజులు వి. రామమూర్తి ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సందర్భంగా గురువారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. సోమయాజులు వి. రామమూర్తి సింగరేణి సంస్థకు అందించిన సుదీర్ఘ సేవలను కొనియాడారు. సంస్థ అభివృద్ధిలో, ముఖ్యంగా సీహెచ్‌పీల పనితీరును ఆధునికీకరించడంలో ఆయన అందించిన సేవలు ఎంతో అభినందనీయమన్నారు. ఎలాంటి మచ్చ లేకుండా పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ సంస్థ ప్రగతికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. పని పట్ల ఆయనకున్న అంకితభావం, నిబద్ధత ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి జా, ఏజీఎం (ఎఫ్‌అండ్‌ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, కేకే ఏజెంట్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, ఇంజనీర్ వంశీధర్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, ఆర్‌కేపీ సీహెచ్‌పీ ఎస్‌ఈ చంద్రమౌళి, ఎస్‌ఈ (ఈఅండ్‌ఎం) నరేష్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొని సోమయాజులు వి. రామమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});