ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సదుపాయాలు కల్పిస్తాం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం మందమర్రి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యాలయంలోని...