మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం మందమర్రి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం విద్యాలయంలోని వంటశాల, భోజనశాలలను పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. వంటశాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి విద్యా బోధన, వసతులు, భోజనం నాణ్యత, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});