అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఓనం వేడుక
భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన ఓనం పండుగ కోల్ బెల్ట్ న్యూస్ (ఆర్మూర్): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ఓనం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు....